– స్వాగతం పలికిన ఎస్.ఐ శివరాం క్రిష్ణ
నవతెలంగాణ – అశ్వారావుపేట
పార్లమెంట్ ఎన్నికల నేపధ్యంలో జరుగుతున్న బదిలీల్లో భాగంగా కూసుమంచి సీ.ఐ గా పనిచేస్తున్న కే.జితేందర్ ను అశ్వారావుపేట కు,ఇక్కడ విధుల్లో ఉన్న కరుణాకర్ ను ఏడూళ్ళ బయ్యారం కు పోలీస్ ఉన్నతిని కారులు బదిలీ చేసారు. సీఐ కరుణాకర్ శనివారం రిలీవ్ అయి ఏడూళ్ళ బయ్యారం లో జాయిన్ కాగా జితేందర్ ఆదివారం అశ్వారావుపేట సిఐ గా బాధ్యతలు స్వీకరించారు. ఈ సందర్భంగా ఆయనకు పుష్పగుచ్ఛం ఇచ్చి ఎస్.ఐ శివరాం క్రిష్ణ స్వాగతం పలికారు.అంతకు ముందే సిఐ జితేందర్ స్థానిక ఎమ్మెల్యే జారే ఆదినారాయణ ను మర్యాదపూర్వకంగా కలిసి పుష్పగుచ్ఛం ఇచ్చి అభినందనలు తెలిపారు.