చామల గెలుపు కోసం చల్మెడ లో జితేందర్ రెడ్డి ఇంటింటి ప్రచారం ..

– బీజేపీ, బీఆర్ఎస్ మాయమాటలను నమ్మొద్దు..
– ఎమ్మెల్యేకు తోడుగా ఎంపీ ని గెలిపించుకుంటే నియోజవర్గాన్ని రంగాలలో అభివృద్ధి చేసుకోవచ్చు..
– కాంగ్రెస్ రాష్ట్ర నాయకులు వేంరెడ్డి జితేందర్ రెడ్డి..
నవతెలంగాణ – మునుగోడు
కాంగ్రెస్ భువనగిరి పార్లమెంట్ అభ్యర్థి చామల కిరణ్ కుమార్ రెడ్డి గెలుపు కోసం కాంగ్రెస్ రాష్ట్ర నాయకులు వేంరెడ్డి జితేందర్ రెడ్డి ఆదివారం మండలంలోని చల్మడ గ్రామంలో ఇంటింట ప్రచారం నిర్వహించారు. గత పది సంవత్సరాలుగా అధికారంలో ఉన్న బిజెపి ప్రజలకు చేసిన మోసాలపై ప్రజలకు అవగాహన   కల్పించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వస్తే అన్ని వర్గాల ప్రజలకు సంక్షేమ పథకాలను అందిస్తుందని అన్నారు . లోక్ సభ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీని గెలిపించేందుకు ప్రజలంతా సిద్ధంగా ఉన్నారని తెలిపారు. మునుగోడు నియోజకవర్గం అన్ని రంగాలలో అభివృద్ధి చేసుకునేందుకు ఎమ్మెల్యేకు తోడుగా ఎంపీ ని గెలిపించుకుంటే నియోజకవర్గంలో పెండింగ్లో ఉన్న ప్రాజెక్టులను పూర్తి చేసుకోవచ్చని అన్నారు . బిజెపి బీఆర్ఎస్ చెప్పే మోసపూరిత మాటలు నమ్మి ప్రజలు మోసపోవద్దని అన్నారు. ఈ కార్యక్రమంలో బాతరాజు సత్తయ్య ,  కొంక చంద్రయ్య , ఉప్పర బోయిన నర్సింహా , కొంక శంకర్, గాదెపాక యాదయ్య, రమేష్, నర్సింహా, సైదులు, రామకృష్ణ, లింగస్వామి, సీపీఐ నాయకులు లాలయ్య యాదయ్య, బి యాదయ్య , పి గాలయ్య, పగిళ్ల  శ్రీరాములు,  కర్నాటి రామకృష్ణ గౌడ్, గాదెపాక శరత్, కొంక రవి, కట్ట పెంటయ్య, కట్ట దశరథ్ తదితరులు ఉన్నారు.