
మేడారం సమ్మక్క- సారలమ్మ వనదేవతలను మెదక్ జిల్లా సీనియర్ సివిల్ జడ్జ్ జితేందర్ సకుటుంబ సపరివారంగా ఆదివారం రోజున వనదేవతలను దర్శించుకున్నారు. ఎండోమెంట్ అధికారులు, పూజారులు ఆలయ సాంప్రదాయాల ప్రకారం డోలు వాయిద్యాలతో ఘనంగా స్వాగతం పలికారు. సమ్మక్క- సారలమ్మ, పగటిద్దరాజు, గోవిందరాజు వనదేవతలకు ఇష్టమైన పసుపు, కుంకుమ, చీరే, సారే సమర్పించి ప్రత్యేక మొక్కులు చెల్లించారు. అనంతరం ఎండోమెంట్ అధికారులు శాలువాలు కప్పి సన్మానించి, అమ్మవారి ప్రసాదం అందించారు. అనంతరం జడ్జి జితేందర్ మాట్లాడుతూ వనదేవతలను దర్శించుకోవడం ఎంతో మహాభాగ్యంగా ఉందని అన్నారు. ఆయన వెంట గతంలో ములుగు జిల్లా కేంద్రంలో విధులు నిర్వహించిన, పస్రాసిఐ రవీందర్ మిత్రుడు మెదక్ సీఐ బండారి రాజు, ఆర్మీ రమేష్, పూజారులు, ఎండోమెంట్ అధికారి జగదీశ్వర్ బంధుమిత్రులు, కుటుంబ సభ్యులు తదితరులు ఉన్నారు.