మాజీ మంత్రి హరీష్ రావును సన్మానించిన జిట్టా బాలకృష్ణారెడ్డి

నవతెలంగాణ  – భువనగిరి రూరల్
భువనగిరిలో బీఆర్ఎస్ పార్టీ భువనగిరి నియోజకవర్గ విస్తృత స్థాయి సమావేశానికి విచ్చేసిన మాజీ మంత్రి, సిద్దిపేట ఎమ్మెల్యే తన్నీరు హరీశ్ రావు ను  తెలంగాణ ఉద్యమ, బీఆర్ఎస్ నాయకులు జిట్టా బాలక్రిష్ణా రెడ్డి  నివాసానికి వచ్చిన సందర్భంగా పూలమాల శాలువాతో ఘనంగా సన్మానించారు. హరీష్ రావుతో పాటు పలువురిని సన్మానించారు. సన్మానించిన వారిలో  రాజ్యసభ సభ్యులు వద్దిరాజు రవిచంద్ర, భువనగిరి మాజీ ఎమ్మెల్యే పైళ్ల శేఖర్ రెడ్డి, ఎస్సీ కమిషన్ మాజీ చైర్మన్ ఏరోళ్ల శ్రీనివాస్ లు ఉన్నారు.