జిట్టా బాలకృష్ణారెడ్డి సస్పెండ్‌

– వారం రోజుల్లో వివరణ ఇవ్వాలి : బీజేపీ
నవతెలంగాణ బ్యూరో-హైదరాబాద్‌
బీజేపీ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు, యాదాద్రి భువనగిరి జిల్లా నేత జిట్టా బాలకృష్ణారెడ్డిని ఆ పార్టీ సస్పెండ్‌ చేసింది. బుధవారం ఈ మేరకు బీజేపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి గుజ్జుల ప్రేమేందర్‌రెడ్డి ఒక ప్రకటన విడుదల చేశారు. పార్టీ నియమ నిబంధనలు ఉల్లంఘించి, క్రమశిక్షణారాహిత్యానికి పాల్పడినందుకే జిట్టా పార్టీ ప్రాథమిక సభ్యత్వాన్ని రద్దు చేసినట్టు తెలిపారు.