మృతురాలి కుటుంబ సభ్యులను పరామర్శించిన జిట్టా బాలకృష్ణా రెడ్డి

నవతెలంగాణ – వలిగొండ రూరల్
మండలంలోని జంగారెడ్డి పల్లెకు చెందిన ప్రముఖ హైకోర్టు న్యాయవాది బద్దం రామకృష్ణా రెడ్డి మాతృ మూర్తి బద్దం సావిత్రమ్మ ఇటీవల అనారోగ్యానికి గురై మృతిచెందడంతో, శనివారం బీఆర్ఎస్ రాష్ట్ర నాయకులు జిట్టా బాలకృష్ణారెడ్డి పాల్గొని వారి కుటుంబసభ్యులను పరామర్శించారు. ఈ కార్యక్రమంలో గోమారి సుధాకర్ రెడ్డి, మందడి  జితేందర్ రెడ్డి, మస్కు నర్సింహా, నానచర్ల రమేష్, కొండూరు సత్తయ్య, అంబటి మోహన్ , నవీన్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.