బీజేపీకి జిట్టా రాజీనామా?

– ప్రియాంక గాంధీ సభలో కాంగ్రెస్‌లో చేరిక
నవతెలంగాణ బ్యూరో – హైదరాబాద్‌
బీజేపీకి జిట్టా బాలకృష్ణారెడ్డి రాజీనామా చేసినట్టు తెలుస్తున్నది. ప్రియాంక గాంధీ సభలో ఆయన కాంగ్రెస్‌ తీర్థం పుచ్చుకోనున్నట్టు ప్రచారం జరుగుతున్నది. ఇప్పటిదాకా యాదాద్రి భువనగిరి కాంగ్రెస్‌ జిల్లా అధ్యక్షుడిగా ఉన్న కుంభం అనిల్‌ రెడ్డి టీఆర్‌ఎస్‌ పార్టీలో చేరడంతో కాంగ్రెస్‌ నుంచి పోటీ చేసేందుకు జిట్టాకు లైన్‌ క్లియర్‌ అయినట్టు ప్రచారం జరుగుతున్నది. బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడుగా ఉన్న బండి సంజరుని పదవి నుంచి తప్పించడంపై జిట్టా బాలకృష్ణారెడ్డి తీవ్రంగా వ్యతిరేకిస్తున్న విషయం తెలిసిందే. జిట్టా బాలకృష్ణారెడ్డి తెలంగాణ ఉద్యమంలో చురుగ్గా పనిచేశారు. భువనగిరి నియోజకవర్గం నుంచి రెండుసార్లు ఇండిపెండెంట్‌గా పోటీ చేసి స్వల్ప తేడాతో ఓడిపోయారు.