తిరిగి తిరిగి బీఆర్ఎస్ గూటికే చేరిన జిట్టా

నవతెలంగాణ –  భువనగిరి
తెలంగాణ మలిదశ ఉద్యమకారుడు జిట్టా బాలకృష్ణారెడ్డి కాంగ్రెస్ నుండి బీఆర్ఎస్ లో శుక్రవారం కేటీఆర్ సమక్షంలో చేరారు. నెల రోజుల క్రితం బీజేపీ నుండి కాంగ్రెస్ లో చేరిన బాలకృష్ణారెడ్డి తిరిగి కేసీఆర్ చెంతకు చేరుకున్నారు. బాలకృష్ణారెడ్డి తెలంగాణ ఉద్యమంలో కీలక పాత్ర వహించారు. తెలంగాణ సాంస్కృతిక కళారూపాలు వంటకాలను దేశవ్యాప్తంగా ప్రచారం చేయడంలో కీలక భూమిక పోషించారు. భువనగిరి శాసనసభ టికెట్ రాకపోవడంతో స్వతంత్ర అభ్యర్థిగా పోటీచేసి కొద్దిపాటి మెజార్టీతో ఓడిపోయారు.  అనంతరం కాంగ్రెస్ పార్టీలో చేరారు. వైయస్సార్ మృతి చెందడంతో అనంతరం వైఎస్సార్ పార్టీలో చేరారు.  అనంతరం స్వతహాగా యువ తెలంగాణ పార్టీ ఏర్పాటు చేశారు. 2018లో భువనగిరి నియోజకవర్గంలో బీజేపీ మద్దతు స్వతంత్ర అభ్యర్థిగా పోటీ చేశారు. గత ఎమ్మెల్సీ ఎన్నికలలో తమ పార్టీ తరఫున అభ్యర్థిని నిలబెట్టారు.  తను చేరడమే కాకుండా తన అనుచరులు బీఆర్ఎస్ లో చేరడం పట్ల ఎమ్మెల్యే పైళ్ల శేఖర్ రెడ్డి తో పాటు బీఆర్ఎస్ శ్రేణులు స్వాగతం పలికాయి.