జేఎల్‌ తుది ఫలితాలు విడుదల

– టీజీపీఎస్సీ వెబ్‌సైట్‌లో ఎంపికైన అభ్యర్థుల వివరాలు
నవతెలంగాణ బ్యూరో – హైదరాబాద్‌
రాష్ట్రంలోని ఇంటర్‌ విద్యాశాఖ కమిషనరేట్‌ పరిధిలో 1,392 జూనియర్‌ లెక్చరర్‌ (జేఎల్‌) పోస్టులకు సంబంధించిన తుది ఫలితాలను తెలంగాణ పబ్లిక్‌ సర్వీస్‌ కమిషన్‌ (టీజీపీఎస్సీ) మంగళవారం విడుదల చేసింది. ఈ మేరకు టీజీపీఎస్సీ కార్యదర్శి ఈ నవీన్‌ నికోలస్‌ ఒక ప్రకటన విడుదల చేశారు. కెమిస్ట్రీ ఉర్దూ మాధ్యమంలో మల్టీ జోన్‌-1 ముగ్గురు ఎంపికయ్యారనీ, అర్హులైన అభ్యర్థులేనందున మూడు పోస్టులకు ఎంపిక చేయలేదని తెలిపారు. మల్టీజోన్‌-2లో ఎనిమిది మంది ఎంపికయ్యారనీ, అర్హులైన అభ్యర్థుల్లేనందున ఐదు పోస్టులు ఖాళీగా ఉన్నాయని వివరించారు. సివిక్స్‌లో మల్టీజోన్‌-1లో 35 మంది, మల్టీజోన్‌-2లో 21 మంది అభ్యర్థులు ఎంపికయ్యారని పేర్కొన్నారు. సివిక్స్‌ ఉర్దూ మాధ్యమంలో మల్టీజోన్‌-1లో ఎనిమిది మంది ఎంపికయ్యారని తెలిపారు. అర్హులైన అభ్యర్థుల్లేనందున ఐదు పోస్టులు మిగిలాయని పేర్కొన్నారు. మల్టీజోన్‌-2లో ఇద్దరు ఎంపికయ్యారనీ, అర్హులైన అభ్యర్థుల్లేనందున ఒక పోస్టుకు ఎంపిక చేయలేదని వివరించారు. సివిక్స్‌ మరాఠీ మాధ్యమంలో మల్టీజోన్‌-1లో ఒకరు ఎంపికయ్యారని తెలిపారు. ఉర్దూ లెక్చరర్‌ పోస్టులకు మల్టీజోన్‌-1లో పది మందిని ఎంపిక చేశామని తెలిపారు. అర్హులైన అభ్యర్థుల్లేనందున ఐదు పోస్టులు మిగిలాయని పేర్కొన్నారు. మల్టీజోన్‌-2లో 11 మంది ఎంపికయ్యారని తెలిపారు. అర్హులైన అభ్యర్థులు అందుబాటులో లేనందున రెండు పోస్టులు మిగిలాయని పేర్కొన్నారు. జేఎల్‌ పోస్టులకు ఎంపికైన అభ్యర్థుల వివరాలు షషష.్‌రజూరష.స్త్రశీఙ.ఱఅ వెబ్‌సైట్‌లో పొందుపర్చామని తెలిపారు. 1,392 జేఎల్‌ పోస్టుల భర్తీకి 2022, డిసెంబర్‌ తొమ్మిదిన టీజీపీఎస్సీ నోటిఫికేషన్‌ను జారీ చేసిన విషయం తెలిసిందే. జూనియర్‌ లెక్చరర్‌ పోస్టులకు సంబంధించి ఇంకా వివిధ సబ్జెక్టుల్లో ఎంపికైన అభ్యర్థుల తుది జాబితాను ప్రకటించాల్సి ఉన్నది. మిగతా సబ్జెక్టుల జేఎల్‌ తుది ఫలితాలను వెంటనే ప్రకటించాలని అభ్యర్థులు కోరుతున్నారు.