
మండలంలోని మనోహరాబాద్ గ్రామానికి చెందిన జయం కేపిఎం రైతు ఉత్పత్తిదారుల సంఘం గురువారం మహారాష్ట్ర స్టడీ టూర్కు బయలుదేరినట్లు రైతు ఉత్పత్తిదారుల సంఘం కోఆర్డినేటర్ తిరుపతిరెడ్డి తెలిపారు. మహారాష్ట్రలోని ఇంగోలి దత్త గురు ఉత్పత్తిదారుల సంఘం, నాసిక్ లోని సహాయాద్రి రైతు ఉత్పత్తిదారుల సంఘాన్ని సందర్శించడానికి మండలంలోని ఐదు గ్రామాల ఆదర్శ రైతులు బయలుదేరి వెళుతున్నట్టు తిరుపతిరెడ్డి తెలియజేశారు. మండలంలోని పడకల్ ,జక్రాన్పల్లి, కలిగోట్, మనోహరాబాద్, ధర్పల్లి మండలంలోని మైలారం ఆదర్శ రైతులు స్టడీ టూర్కు బయలుదేరి వెళ్లారు. స్టడీ టూరు బస్సును మండల వ్యవసాయ అధికారి దేవిక జండా ఊపి ప్రారంభించారు.