జాబ్‌ క్యాలెండర్‌ నిరుద్యోగుల ఆశాకిరణం

– రియాజ్‌, చనగాని దయాకర్‌
నవతెలంగాణబ్యూరో-హైదరాబాద్‌
రాష్ట్ర ప్రభుత్వం విడుదల చేసిన జాబ్‌ క్యాలెండర్‌ నిరుద్యోగులకు ఆశాకిరణమని గ్రంథాలయ రాష్ట్ర చైర్మెన్‌ రియాజ్‌, టీపీసీసీ అధికార ప్రతినిధులు చనగాని దయాకర్‌, డాక్టర్‌ లింగం యాదవ్‌ అన్నారు. శనివారం హైదరాబాద్‌లోని గాంధీభవన్‌లో ఆయన విలేకర్లతో మాట్లాడారు. తమిళనాడు, కేరళ తరహాలో జాబ్‌ క్యాలెండర్‌ రాష్ట్ర ప్రభుత్వం విడుదల చేసిందన్నారు. బీఆర్‌ఎస్‌ పాలనలో ఉద్యోగాలు భర్తీ చేయకుండా, నిరుద్యోగుల అంశాన్ని పక్కన పెట్టిందని విమర్శించారు. చనగాని దయాకర్‌ మాట్లాడుతూ పదేండ్ల బీఆర్‌ఎస్‌ పాలనలో నిరుద్యోగులు తీవ్రమైన ఆందోళనలకు గురయ్యారని ఆవేదన వ్యక్తం చేశారు. కాంగ్రెస్‌ ప్రభుత్యం నిరుద్యోగుల సమస్యలపై అన్ని విధాలుగా అలోచించి జాబ్‌ క్యాలండర్‌ విడుదల చేసిందని చెప్పారు. ఉద్యోగ ఖాళీల వివరాలను టీజీపీఎస్సీ త్వరలో ప్రకటి స్తుందని స్పష్టం చేశారు. స్కిల్‌ యూనివర్సిటీతో తెలంగాణ యువతకు ఉద్యోగ అవకాశాలు పెరుగుతాయమని ఆశాభావం వ్యక్తం చేశారు.