జాబ్ క్యాలెండర్ కాంగ్రెస్ ప్రభుత్వం వెంటనే విడుదల చేయాలని బీజేవైఎం నియోజకవర్గ కన్వీనర్ ఎనగందుల శ్రావణ్ కుమార్ ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. మంగళవారం మండల కేంద్రంలోని మండల మెజిస్ట్రేట్ కార్యాలయంలో తహసిల్దార్ శ్రీనివాస్ కు నిరుద్యోగ సమస్యలపై వినతిపత్రం అందజేశారు. అనంతరం శ్రవణ్ కుమార్ మాట్లాడుతూ నీళ్లు నిధులు నియామకాల కోసం ఏర్పాటు చేసుకున్న తెలంగాణ రాష్ట్రంలో టిఆర్ఎస్ ప్రభుత్వం నియామకాల విషయంలో నిరుద్యోగులను మోసం చేస్తే అదే తరహాలో కొత్తగా ఏర్పడిన కాంగ్రెస్ ప్రభుత్వం సైతం అడుగులు వేస్తుందని దుయ్యబట్టారు. నిరుద్యోగ సమస్యపై బీజేవైఎం గత కొంతకాలంగా ఉద్యమిస్తూనే ఉంది అయినప్పటికీ రాష్ట్ర ప్రభుత్వాలు మొద్దు నిద్రను విడడం లేదని అన్నారు. సాధ్యం కానీ హామీలిచి అధికారంలోకి వచ్చిన రాష్ట్ర ప్రభుత్వాలు స్వార్ధ ప్రయోజనాలలే ధ్యేయంగా పాలన చేస్తున్నారని మండిపడ్డారు. ఇప్పటికైనా నిరుద్యోగ సమస్యపై రాష్ట్ర ప్రభుత్వం కళ్లు తెరవాలని పీతబోధ చేశారు. ఈ కార్యక్రమములో బీజేపీ ఎన్నికల కన్వీనర్ నూనె అనిల్, బీజేవైఎం జిల్లా కార్యదర్శి రాపాక ప్రశాంత్, బీజేవైఎం మండల ప్రధాన కార్యదర్శి మంచాల సుమన్, ఉపాధ్యక్షులు జక్కుల సందీప్, రాసల రాకేష్ , రాకేష్ తదితరులు పాల్గొన్నారు.