నవతెలంగాణ – డిచ్ పల్లి
తెలంగాణ యూనివర్సిటీ వైస్ ఛాన్సలర్ , రిజిస్ట్రార్ ల ఆదేశానుసారం యూనివర్సిటీ లో పీ.జీ. ఫైనల్ ఇయర్ చదువుతున్న విద్యార్థులకు ఈ నెల 9న తెలంగాణ యూనివర్సిటీ లో, తెలంగాణ అకాడమీ ఆఫ్ స్కిల్ అండ్ నాలెడ్జ్ సంస్థలు సంయుక్తంగా డీ.ఎస్. టెక్నాలజీస్ కంపెనీ లో గల టెక్నికల్ రిక్రూటర్, బిజినెస్ డెవలప్‌మెంట్ ఎగ్జిక్యూట్, డిజిటల్ మార్కెటింగ్ ఖాళీల భర్తీకి డి.ఎస్.టెక్నాలజీస్ వారిచేఉద్యోగ మేళాను నిర్వహించనున్నారని ఈ ఉద్యోగ మేళాలో ఉద్యోగ ఔత్సాహిలకు పిఐఅర్ (వ్యక్తిగత పరిచయ రౌండ్) గ్రూప్ డిస్కషన్, F2F( ముఖాముఖి) వంటి రౌండ్ లతో ఇంటర్వ్యూ నిర్వహిస్తారని ప్లేస్మెంట్ సెల్ డైరెక్టర్ డాక్టర్ పాతా నాగరాజు శనివారం తెలిపారు. పీ జీ ఫైనల్ ఇయర్ చదువుతున్న విద్యార్థులందరూ ఈనెల 8వ తేదీలోపు ప్లేస్మెంట్ సెల్లో వివరాలు నమోదు చేసుకోవాలని డైరెక్టర్ తెలిపారు.