ఆదిలాబాద్ పట్టణంలోని ప్రభుత్వ సైన్స్ డిగ్రీ కళాశాలలో ఈనెల 29న మంగళవారం టీఎస్ కేసి (తెలంగాణ స్కిల్స్ అండ్ నాలెడ్జ్ సెంటర్) ఆధ్వర్యంలో టాస్క్ (తెలంగాణ అకాడమీ ఫర్ స్కిల్ అండ్ నాలెడ్జ్) వారి సౌజన్యంతో జాబ్ మేళాను నిర్వహించడం జరుగుతుందని కళాశాల ఇన్చార్జి ప్రిన్సిపల్ కెప్టెన్ జగ్రామ్ అంతర్వేది, టిఎస్కేసి కోఆర్డినేటర్ డాక్టర్. ఐ. శ్రావణి శనివారం ఒక ప్రకటనలో పేర్కొన్నారు. ఈ జాబ్ మేళాలో ఎంఎస్ఎన్ లాబొరేటరీస్ లిమిటెడ్ లో జూనియర్ ఎగ్జిక్యూటివ్ ట్రైనీ పోస్టులు ఉంటాయని పేర్కొన్నారు. ఈ జాబ్ మేళాకు బీఎస్సీ కెమిస్ట్రీ 2024, 2025 సంవత్సరంలో పాస్ అయి ఉండాలని, 18 ఏళ్లు నిండి, కేవలం మేల్ క్యాండిడేట్స్ అర్హులని పేర్కొన్నారు. విద్యార్థులు ఇంటర్వ్యూకు వచ్చేటప్పుడు ఒక జత రెస్యూమే, రెండు పాస్ పోర్ట్ సైజ్ ఫోటోలు, ఒరిజినల్ అండ్ జిరాక్స్ సెట్, ఐడి ప్రూఫ్ తెచ్చుకోవాలని పేర్కొన్నారు. ఉదయం 9 గంటల నుండి ఈ జాబ్ డ్రైవ్ ప్రారంభం అవుతుందని వివరాలకు ఎండి.ఇమ్రాన్అలీ-9703533626 ను సంప్రదించాలని సూచించారు.