ఆదిలాబాద్ జిల్లాలోని నిరుద్యోగ యువకులకు ప్రైవేటు రంగంలో ఉద్యోగాలను కల్పించుటకు ఈ నెల 30న పట్టణంలోని సాత్నాల క్యార్టర్స్ వద్దనున్న జిల్లా ఉపాధి కార్యాలయంలో జాబ్ మేళ నిర్వహిస్తున్నట్లు ఉపాధి కల్పన అధికారి మిల్కా శుక్రవారం ఒక ప్రకటనలో పేర్కొన్నారు. ప్రైవేటు కంపెనీలో గల ఉద్యోగాల ఎంపిక జరుగుతుందని ఎంపిక అయిన వారికి రూ.14వేలకు పైగా వేతనంతో పాటు ఇతర అలవెన్సులు ఇవ్వబడతాయని పేర్కొన్నారు. అభ్యర్థుల వయస్సు 18 సం.ల నుండి 37 సం.ల లోపు గల పురుషులు అర్హులి పేర్కొన్నారు. అర్హత ఆసక్తి గల జిల్లా నిరుద్యోగ యువకులు తమ బయోడేటా విద్యార్హతల సర్టిఫికెట్ తో పాటు ఆధార్ కార్డు, పాన్ కార్డు జిరాక్స్ కాపీలతో జిల్లా ఉపాధి కార్యాలయం మంగళవారం ఉదయం 10.30 కు జరిగే మేళకు హాజరు కావాలని పేర్కొన్నారు. నిరుద్యోగ యువకులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని కోరారు. పూర్తి వివరాలకు 9494305417, 9177616132 నంబరులను సంప్రదించాలని సూచించారు.