నవతెలంగాణ – సిద్దిపేట
ప్రతిభ డిగ్రీ కళాశాల సిద్దిపేట లో యాక్సిస్ బ్యాంక్ లో శాశ్వత ప్రాతిపాదికన నియామకాల కొరకు ఈ నెల 11న కళాశాలలో ఉద్యోగ మేళ నిర్వహిస్తున్నట్టు ప్రిన్సిపాల్ డా. సూర్య ప్రకాష్ రావు తెలిపారు. శుక్రవారం ఆయన మాట్లాడుతూ ఈ ఉద్యోగ మేళాకు ఏదైనా డిగ్రీ/ బిటెక్ లో 50 శాతం మార్కులు కలిగివుండి, 1996-2003 మధ్య జన్మించి, 28 సంవత్సరాలు లోపు వయసు ఉన్నవారు అర్హులని అన్నారు. ఆసక్తి గల అభ్యర్థులు శనివారం రోజు ఉదయం 10 :30 గంటల లోపు రెస్యూమే మరియు ఆకాడమిక్ సర్టిఫికెట్స్ తో కళాశాలలో హాజరై ఆవకాశాన్ని వినియోగించుకోవాలని తెలిపారు. మరిన్ని వివరాలకు బ్యాంకు ప్రతినిధి కుమార్ ని 8106764653 నెంబరులో సంప్రదించగలరని తెలిపారు.