నవతెలంగాణ – కంఠేశ్వర్
జిల్లా వైద్య-ఆరోగ్యశాఖలో వివిధ కేటగిరిలలో జరుగుతున్న ఉద్యోగ నియామక ప్రక్రియ ఎటువంటి అవకతవకలు లేకుండా పారదర్శకంగా, ప్రభుత్వ నిబందనల ప్రకారం జరుగుతుందని జిల్లా వైద్య ఆరోగ్యశాఖ అధికారి కార్యాలయం నుండి శుక్రవారం ప్రకటన విడుదల చేశారు. ఇంతవరకు ఎక్కడకూడా అక్రమార్కులకు తావు లేకుండా ఎంపిక ప్రక్రియ పూర్తీ చేయడం జరిగిందని తెలిపారు.భవిష్యత్తులో వైద్య ఆరోగ్య శాఖలో ఎటువంటి అవినీతి జరిగిన, అది ఎవరి దృష్టికి వచ్చిన తమరు జిల్లా వైద్య-ఆరోగ్యశాఖ కార్యాలయంలో వివరాలతో ఫిర్యాదు చేసినట్లయితే తప్పకుండా శాఖాపరమైన చర్యలు తీసుకుంటామని, ఎవరుకూడా మోసపూరిత వ్యక్తుల బారిన పడకుండా జాగ్రత్తలు తీసుకోవాలని,ఏటువంటి చరవాణి సంప్రదింపులకు, దళారీలకు లొంగకుండా తగిన జాగ్రత్తలు తీసుకని, అనుమానాలుంటే తిన్నగా జిల్లా వైద్య ఆరోగ్ని కాధికారి డా. రాజశ్రీని సంప్రదించి నివృతి చేసుకోవచ్చని తెలియజేశారు.