నవతెలంగాణ – కంఠేశ్వర్
కలెక్టరేట్లో శానిటేషన్ కార్మికులకు ఉద్యోగ భద్రత కల్పించాలని సీఐటీయూ జిల్లా ప్రధాన కార్యదర్శి నూర్జహాన్ డిమాండ్ చేశారు. ఈ మేరకు గురువారం ఔట్సోర్సింగ్ కార్మికుల సమస్యలను పరిష్కరించాలని లేబర్ కార్యాలయంలో నిజామాబాద్ ఇన్చార్జి డి సి ఎల్ యోహాను కి వినతి పత్రం అందజేశారు. ఈ సందర్భంగా సీఐటీయూ జిల్లా కార్యదర్శి నూర్జహాన్ మాట్లాడుతూ.. నిజామాబాద్ జిల్లా కలెక్టరేట్ లో శానిటేషన్ నిర్వకొరకు ఏజెన్సీ వాచల్య ఎంటర్ప్రైజెస్ ద్వార పద్దతిలో పని చేయంచుకోవడానికి నియమించుకున్న ఔట్సోర్సింగ్ కార్మికులకు గత 2 సం॥లుగ చట్ట ప్రకారం కనీస వేతనాలు చెల్లించటంలో కాంట్రాక్టర్ నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారు అని తెలియజేశారు. అదేవిధంగా కార్యికులకు పిఎఫ్, ఈ ఎస్ ఐ అమలు జరపటంలో కూడ విబంధన లు పాటించటం లేదు. గుర్తింపు కార్డులు లేవు. అందువల్ల కారిక్రం ను కనీస వేతనాలు , పిఎఫ్, ఈ ఎస్ ఐ, అమలు జరపటంతో పాటు, వారంతపు సెలవులను, పండగ సెలవులను అమలు జరపాలని, కార్మికులకు రక్షణ కల్పించి ఉద్యోగ బద్రత కల్పించాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో అలకానంద, నవనీత, లక్ష్మి, పద్మ, రమా, హేమా,సవిత, నర్సమ్మ, మీనా, ఆశ బాయి, తదితరులు పాల్గొన్నారు.