నవతెలంగాణ బ్యూరో – హైదరాబాద్
విదేశాల్లో ఉద్యోగం చేయాలనుకునే డిగ్రీ, ఇంజినీరింగ్ పట్ట భద్రులు తమ బయోడేటాను పంపించాలని తెలంగాణ ఓవర్సీస్ మ్యాన్‌పవర్ కంపెనీ లిమిటెడ్ (టామ్‌కామ్) సీఈవో ఒక ప్రకటనలో తెలిపారు. గుర్తింపు పొందిన విశ్వవిద్యాలయం నుంచి డిగ్రీ, ఇంజినీరింగ్ పాసైన వారు ఈ ఉద్యోగాలకు అర్హులని పేర్కొన్నారు. జపాన్, అమెరికా, ఆస్ట్రేలియా, కెనడా, జర్మనీ, హంగేరీ,పోలాండ్ సౌది అరేబియా తదితర దేశాల్లో ఆకర్శణీయమైన జీతం లభిస్తుందనివెల్లడించారు. మరిన్ని వివరాలకు 9440098590,9440051452 నెంబర్లలో సంప్రదిం చాలని తెలిపారు.