నవతెలంగాణ – హుస్నాబాద్ రూరల్
రాష్ట్ర ప్రభుత్వం గ్రూప్స్, డీఎస్సీ ఉద్యోగాలను పెంచి పరీక్షలను నిర్వహించాలని డిమాండ్ చేస్తూ శుక్రవారం హుస్నాబాద్ పట్టణంలోని అంబేద్కర్ చౌరస్తాలో గిరిజన సంఘాల నాయకులు నిరసన చేపట్టారు. ఈ సందర్భంగా నాయకులు మాట్లాడుతూ కాంగ్రెస్ అధికారంలోకి రాగానే రెండు లక్షల ఉద్యోగాలు భర్తీ చేస్తామని, జాబ్ క్యాలెండర్ ను విడుదల చేయకుండా నిరుద్యోగులను నిర్లక్ష్యం చేస్తుందని గిరిజన నాయకులు ఆరోపించారు. విద్యార్థులు చదువుకోవడానికి సమయం ఇచ్చి డిఎస్సి పరీక్షను నిర్వహించాలని డిమాండ్ చేశారు. ఇకనైనా రాష్ట్ర ప్రభుత్వం నిరుద్యోగుల పక్షాన నిలువకుంటే నిరుద్యోగులందరం ఏకమై రాష్ట్ర ప్రభుత్వాన్ని గద్దే దించుతామని హెచ్చరించారు. లంబాడి హక్కుల సమితి జిల్లా అధ్యక్షులు సత్యం నాయక్, కృష్ణ నాయక్ గిరిజన సంగ నేత భుక్య తిరుపతి నాయక్, లక్షపతి నాయక్ తదితరులు పాల్గొన్నారు.