వేలంలోకి జోఫ్రా ఆర్చర్‌!

Jofra Archer up for auction!– జాబితాలో చేర్చిన
– ఐపీఎల్‌ నిర్వాహకులు
ముంబయి : గాయాలు, పని ఒత్తిడి అంటూ తరచుగా ఐపీఎల్‌ సీజన్‌ మధ్యలోనే స్వదేశానికి వెళ్లిపోతున్నారనే కారణాలతో కొందరు విదేశీ క్రికెటర్లను బీసీసీఐ ఈసారి ఐపీఎల్‌ 2025 ఆటగాళ్ల మెగా వేలానికి దూరం పెట్టిన సంగతి తెలిసిందే. ఆ జాబితాలో జోఫ్రా ఆర్చర్‌, మార్క్‌వుడ్‌ సైతం ఉన్నారు. సౌదీ అరేబియా రాజధాని జెడ్డా వేదికగా ఐపీఎల్‌ ఆటగాళ్ల వేలం ఈ నెల 24 నుంచి ఆరంభం కానుంది. రెండు రోజుల పాటు జరిగే వేలంలో.. తాజాగా జోఫ్రా ఆర్చర్‌ పేరును తిరిగి చేర్చినట్టు సమాచారం. ఈ మేరకు ప్రాంఛైజీలకు ఐపీఎల్‌ నిర్వాహకులు సమాచారం అందించారు. రూ. 2 కోట్ల కనీస ధరతో ఫాస్ట్‌ బౌలర్ల సెట్‌లో ఆర్చర్‌ వేలంలోకి తొలి రోజే రానున్నాడు. 2022 వేలంలో ఆర్చర్‌ను రూ. 8 కోట్ల ధరకు ముంబయి ఇండియన్స్‌ తీసుకుంది. యుఎస్‌ బౌలర్‌ సౌరభ్‌ నేత్రావల్కర్‌, ముంబయి ఆటగాడు హార్దిక్‌ తోమారెలు సైతం వేలంలో జాబితాలోకి వచ్చారు. దీంతో వేలంలో రానున్న ఆటగాళ్ల సంఖ్య 576కు పెరిగింది.