తెలంగాణ విద్యార్థి పరిషత్ లో చేరికలు

నవతెలంగాణ – ఆర్మూర్
విద్యారంగ సమస్యలపై పోరాటడానికి ఆకర్షితులై విద్యార్థులు ముందడుగు. వేస్తున్నాను. ఈ సందర్భంగా మంగళవారం తెలంగాణ విద్యార్థి పరిషత్ జిల్లా అధ్యక్షుడు బొబ్బిలి కళ్యాణ్ ,నగర అధ్యక్షుడు అఖిల్ ఆధ్వర్యంలో 15 మంది విద్యార్థులు టీజీవిపి లో చేరడం జరిగింది. ఈ సందర్భంగా జిల్లా అధ్యక్షులు మాట్లాడుతూ తెలంగాణ విద్యార్థి పరిషత్ పది సంవత్సరాలు పూర్తి చేసుకుని 11 వ సంవత్సరం విద్యారంగ సమస్యలపై పోరాడడానికి రాష్ట్ర ప్రభుత్వ నిరంకుశ పాలనపై ఎదుగుతిరగడానికి విద్యార్థులకు చేస్తున్న మోసాలని అన్యాయాలని అనునిత్యం బయటపెడుతూ వాటిపై పోరాడుతుంది.. విద్యార్థి హక్కులు ,ప్రయోజనాల కోసం విద్యార్థుల నేతృత్వంలోనే చోరువా విద్యలో విద్యార్థులే ప్రధాన వాటాదారులని టీజీవిపి విశ్వసిస్తుంది.తెలంగాణ విద్యార్థి పరిషత్ అనే సంస్థ ఏ రాజకీయ పార్టీకి గాను ఏ రాజకీయ నాయకుడికిగాను తొత్తులుగా పనిచేయదని కేవలం విద్యార్థుల కోసమే పని చేస్తుందని విద్యార్థి హక్కుల కోసం ఎంతటి వారినైనా ఎదిరిస్తుందని  తెలియజేశారు విద్యార్థుల హక్కులను సాధించుకుంటుందని చెప్పుకొచ్చారు ఇలాగే ప్రతి విద్యార్థి రాజకీయ పార్టీలకు మభ్యపడి విద్యకు దూరం కావద్దని చదువుతూ తన హక్కులకై పోరాడాలని దానికి ప్రధాన ప్లాట్ఫారం తెలంగాణ విద్యార్థి పరిషత్ మీకు అండగా ఉంటుందని తెలంగాణ విద్యార్థి పరిషత్ తో కలిసి పోరాడాలని తెలియజేశారు నూతన కమిటీగా చేరికైనా వారుసోహైల్, మహేష్ సుజిత్, అదీబ్, రాజేష్, ఇమ్రాన్, అయాన్ ,సుజిత్ ,రంజిత్, సాయి, రాహుల్ రేవంత్,కిరణ్,మనోజ్, మనీష్, తదితరులు  పాల్గొన్నారు.