కాంగ్రెస్, బీఆర్ఎస్ నుండి బీజేపీలో చేరిక 

నవతెలంగాణ- కమ్మర్ పల్లి: మండలంలోని చౌట్ పల్లిలో గల  బాల్కొండ నియోజకవర్గ బీజేపీ పార్టీ అభ్యర్థి ఏలేటి అన్నపూర్ణమ్మ సమక్షంలో బీఆర్ఎస్, కాంగ్రెస్ పార్టీలకు చెందిన పలువురు శుక్రవారం బీజేపీలో చేరారు.
భారత ప్రధాని నరేంద్ర మోడీ పాలనకు ఆకర్షితులై  మోర్తాడ్ మండలం గాండ్లపేట్ గ్రామానికి చెందిన బీఆర్ఎస్, కాంగ్రెస్ పార్టీలకు చెందిన పలువురు నాయకులు బీజేపీలో చేరినట్లు బీజేపీ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు ఏలేటి మల్లికార్జున్ రెడ్డి తెలిపారు. పార్టీలో చేరిన వారికి అన్నపూర్ణమ్మ బీజేపీ పార్టీ కండువాలను కప్పి సాదరంగా పార్టీలోకి ఆహ్వానించారు.బాల్కొండ నియోజకవర్గ ఎమ్మెల్యేగా  ఏలేటి అన్నపూర్ణమ్మను  భారీ మెజారిటీతో గెలిపించుకోవడమే లక్ష్యంగా బీజేపీ పార్టీలో చేరుతున్నట్లు ఈ సందర్భంగా వారు పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో  మోర్తాడ్ మండల అధ్యక్షులు పుప్పాల నరేష్, నర్సయ్య, గంగాధర్, వెంకటేష్, బీజేపీ నాయకులు, కార్యాకర్తలు, తదితరులు పాల్గొన్నారు.