నవతెలంగాణ-పెద్దకొడప్ గల్: మండలంలోని వడ్లంగ్రామానికిచెందినకాంగ్రేస్ పార్టీ నాయకులు10 మందిశుక్రవారం నాడు బీఆర్ఎస్ పార్టీలోకి చేరారు. మండల కేంద్రంలోని పార్టీ కార్యాలయంలో వీరికి ఎంపీపీ ప్రతాపరెడ్డి పార్టీ ఖండువవేసి పార్టీ లోకి ఆహ్వానించారు. అనంతరంపార్టీ లోకి చేరిన నాయకులు మాట్లాడుతూ గత 15 సంవత్సరాల నుండీ కాంగ్రెస్ పార్టీలోఉండిఈ రోజుతెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం చేస్తున్న అభివృద్ధి సంక్షేమ పథకాలను ఆకర్షితులై మేముఅభివృద్ధి కోసం బీఆర్ఎస్ పార్టీలోకి చేరడం జరగిందని అన్నారు. అనంతరంఎంపీపీ మాట్లాడుతూ కాంగ్రేస్ పార్టీ నాయకులు బీఆర్ఎస్ పార్టీ లోకిచేరడంచాలాసంతోషకరమైన విషయమని అన్నారు. భారత దేశంలోనేతెలంగాణ రాష్ట్రం అభివృద్ధిలో ముందుకు సాగుతుందని ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రవేశ పెట్టిన సంక్షేమ పథకాలు ప్రతి ఒక్కరికి ఎదో ఒక రూపమలోఅందిస్తున్న ఘనత కేసీఆర్ కెదక్కిందనిఆయన కొనియాడారు.కార్యక్రమంలో బీఆర్ఎస్ పార్టీ మండల అధ్యక్షులువిజయ్ దేశాయ్, వడ్లం సర్పంచ్ నగేష్ మలిగొండ, సర్పంచ్ ఫోరం మండల అధ్యక్షులు తిరుమలరెడ్డి, సొసైటీ చైర్మన్ హన్మంత్ రెడ్డి.కోఆప్షన్ నెంబర్ జాఫర్, మార్కెట్ కమిటీ వైస్ చైర్మన్ ఖండేరావు పటేల్, గుండె రావు పటేల్, బీఆర్ఎస్ యూత్ మండల ప్రెసిడెంట్ రమేష్,వీరేశం పాల్గొన్నారు.