
భీంగల్ పట్టణ కేంద్రానికి చెందిన బీజేపీ నాయకుడు సంధ్యా నాయక్ కాంగ్రెస్ పార్టీలో చేరారు. ఈయనకు పార్టీ నియోజకవర్గ ఇన్చార్జి ముత్యాల సునీల్ రెడ్డి కండువా కప్పి ఆహ్వానించారు. రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ చేస్తున్న అభివృద్ధి పథకాలను ప్రజల్లోకి తీసుకెళ్లి ఎంపీ అభ్యర్థి జీవన్ రెడ్డి గెలుపుకు నిరంతరం కృషి చేయాలని సునీల్ రెడ్డి ఈ సందర్భంగా సూచించారు. ఈ కార్యక్రమంలో మండల కాంగ్రెస్ నాయకులు ఉన్నారు.