
మండలంలోని ఏదుళ్లగూడెం కు చెందిన బిఆర్ఎస్ పార్టీ సర్పంచ్ బోడపట్ల భారతమ్మ భర్త జాన్ రెడ్డి కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే అభ్యర్థి కుంభం అనిల్ కుమార్ రెడ్డి సమక్షంలో మంగళవారం కాంగ్రెస్ పార్టీలో చేరారు. ఆయనకు పార్టీ కండువా కప్పి సాదరంగా ఆహ్వానించారు. ఈ కార్యక్రమంలో ఎంపిపి నూతి రమేష్ , ఎంపీటీసీ గూడురు వెంకట్ రెడ్డి, బోళ్ల శ్రీనివాస్, గుర్రం లక్ష్మారెడ్డి, గరిసె రవి, కాసుల వెంకన్న, పుల్లగుర్ల సుదర్శన్ రెడ్డి, గూడురు అశోక్ రెడ్డి, నరేందర్ రెడ్డి, శ్రీనివాస్ రెడ్డి, కొండల్ రెడ్డి, బాస్కర్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.