
నవతెలంగాణ-నూతనకల్ : సీపీఐ(ఎం) పార్టీ చేస్తున్న ప్రజా పోరాటాలకు ఆకర్షితులై వివిధ పార్టీలకు చెందిన నాయకులు కార్యకర్తలు భారీ సంఖ్యలో సీపీఐ(ఎం) లో చేరుతున్నారని సీపీఐ(ఎం) రాష్ట్ర కమిటీ కార్యదర్శి వర్గ సభ్యులు మాజీ శాసనసభ సభ్యులు జూలకంటి రంగారెడ్డి అన్నారు శుక్రవారం జిల్లా కేంద్రంలో జరిగిన పార్టీ జిల్లా విస్తృతస్థాయి సమావేశంలో ఆ పార్టీ జిల్లా కార్యదర్శి మల్లు నాగార్జున రెడ్డి ఆధ్వర్యంలో మండల పరిధిలోని చిల్పకుంట్ల గ్రామానికి చెందిన పలువురు నూతనంగా పార్టీలో చేరారు పార్టీలో చేరిన వారికి పార్టీ కండువాను కప్పి సాదరంగా ఆహ్వానించారు, ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పార్టీలో చేరడంఅభినందనీయమన్నారు.చేరిన కార్యకర్తలనుకంటికి రెప్పల కాపాడుకుంటామన్నారు. పార్టీలో చేరిన వారిలో పిల్లి సత్తయ్య, బద్దం మోహన్ రెడ్డి, మున్న నాగమల్లు, బాణాల వెంకట రమణమ్మ ఉన్నారు.ఈ కార్యక్రమంలో సీపీఐ(ఎం) జిల్లా కార్యదర్శి వర్గ సభ్యులు నెమ్మాదివెంకటేశ్వర్లు, కోలిశెట్టి యాదగిరిరావు, మట్టిపల్లి సైదులు, మేదరమెట్ల వెంకటేశ్వరరావు, కోట గోపి, చెరుకు ఏకలక్ష్మి, సీపీఐ(ఎం) మండల కార్యదర్శి కందాల శంకర్ రెడ్డి, గ్రామ నాయకులుఅల్లిపురం సంజీవరెడ్డి,తొట్ల లింగయ్య,బత్తుల సోమయ్య,బొజ్జ శీనుతదితరులు పాల్గొన్నారు.