మూడు ముళ్ళతో ఒక్కటయ్యారు..

హీరో శర్వానంద్‌, రక్షితల వివాహ మహోత్సవం జైపూర్‌లోని లీలా ప్యాలెస్‌లో ఆదివారం అంగరంగ వైభవంగా జరిగింది. రామ్‌ చరణ్‌, సిద్ధార్థ్‌, అదితి రావు హైదరీ, యువి క్రియేషన్స్‌ వంశీ, విక్రమ్‌, ఆశిష్‌, హర్షిత్‌, హన్షిత తదితరులతోపాటు
పలువురు సినీ, రాజకీయ ప్రముఖులు హాజరై నూతన వధూవరులను ఆశీర్వదించారు. వివాహ మహోత్సవానికి రెండు రోజుల ముందు మెహందీ, సంగీత్‌, హల్దీ ఈవెంట్స్‌తో పాటు ‘పెళ్లికొడుకు’ వేడుక వైభవంగా జరిగింది. ఈనెల 9వ తేదీన హైదరాబాద్‌లో
శర్వానంద్‌, రక్షిత మ్యారెజ్‌ రిసెప్షన్‌ను గ్రాండ్‌గా నిర్వహించనున్నారు.