ఈరోజు జుక్కల్ మండలంలోని పలు గ్రామాల్లో ఎమ్మెల్యే తోటా లక్ష్మీ కాంతారావు పార్లమెంట్ ఎలక్షన్ ప్రచారంలో పాల్గొన్నారు. అందులో భాగంగా మాదాపూర్ గ్రామ తాజా మాజీ సర్పంచ్ దినేష్ వారి కార్యకర్తలతో సహా బీజేపీ నుండి కాంగ్రెస్ పార్టీ లో జాయిన్ అవ్వడం జరిగింది. అలాగే కత్తల్వాడి, బిజ్జల్ వాడి, హంగర్గ గ్రామాల్లోని పలువురు భరాస మరియు బీజేపీ కార్యకర్తలు నాయకులు తోట లక్ష్మీకాంతరావు గారి చేతుల మీదుగా కాంగ్రెస్ పార్టీలో జాయిన్ అవ్వడం జరిగింది. ప్రచార కార్యక్రమంలో జుక్కల్ మండల కాంగ్రెస్ పార్టీ నాయకులు కార్యకర్తలు పాల్గొనడం జరిగింది.