బీఆర్ఎస్ నుండి కాంగ్రెస్ లోకి  చేరికలు

నవతెలంగాణ – పెద్దకొడప్ గల్
పెద్ద కొడప్ గల్ మండలం పోచారం గ్రామంలో మంగళవారం మండల కాంగ్రెస్ అధ్యక్షులు మహేందర్ రెడ్డి ఆధ్వర్యంలో బిఆర్ఎస్ పార్టీకి చెందిన 25మంది కాంగ్రెస్ పార్టీలో చేరారు. బిఆర్ ఎస్ మండల  ప్రచార కార్యదర్శి అశోక్,గ్రామ;బిఆర్ఎస్ అధ్యక్షులు చంద్రకాంత్ పటేల్, సర్పంచ్ మానెవ్వ భర్త మొగులయ్య లు కాంగ్రెస్ పార్టీలో చేరిన వారిలో ఉన్నారు. ఈ సందర్బంగా వారు మాట్లాడుతు కాంగ్రెస్ పార్టీ చేపడుతున్న సంక్షేమ పథకాలకు ఆకర్షితులై  కాంగ్రెస్ పార్టీలో చేరామని తెలిపారు. పార్లమెంట్ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ ఘనవిజయం సాధించే విధంగా కృషి చేస్తామని తెలిపారు. అనంతరం మండల నాయకులు బేగంపూర్,బేగంపూర్ తండా,కాస్లా బాద్ లలో ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో మండల నాయకులు నాగిరెడ్డి,మోహన్ ,శ్యామప్ప పటేల్, మల్లప్పపటేల్,కల్లూరి పండరి,డాక్టర్ సంజీవ్,రషీద్,రాంసింగ్, ఫెరోజ్,మొగులాగౌడ్,చప్టే నాగు,శీను, బన్షిలాల్  తదితరులు పాల్గొన్నారు.