మండలంలో కాంగ్రెస్ లో చేరికలు

నవతెలంగాణ – భీంగల్
మండలంలోని బడా భీంగల్ గ్రామ విడిసి అధ్యక్షుడు, యువజన సంఘాల నాయకులు మంగళవారం నియోజకవర్గ యూత్ కాంగ్రెస్ అధ్యక్షులు ఆరెపల్లి నాగేద్రబాబు  ఆధ్వర్యంలో కాంగ్రెస్ పార్టీలో చేరారు. వీరికి మాజీ ప్రభుత్వ విప్ అనిల్ ఈరవత్రి  కాంగ్రెస్ పార్టీ కండువా కప్పి ఆహ్వానించారు. ఈ సందర్బంగా అనిల్ ఈరవత్రి గారు మాట్లాడుతూ.. కాంగ్రెస్ పార్టీ చేస్తున్న అభివృద్ధిని చూసి కాంగ్రెస్ పార్టీలో చేరడం  జరుగుతుందని, రాబోయే ఎన్నికల్లో నిజామాబాద్ పార్లమెంటు స్థానం  కైవసం చేసుకోవడం కోసం అందరూ ఒక్కతాటిపై ఉండి కష్టపడాలన్నారు. కాంగ్రెస్ కార్యకర్తల దెబ్బకు బిఆర్ఎస్ పార్టీకి పార్లమెంట్ అభ్యర్థులు దొరకడం  కరువయ్యారని అన్నారు. దేశంలో కూడా రాబోయేది కాంగ్రెస్ ప్రభుత్వమేనని తెలిపారు. ఈ కార్యక్రమంలో మండల కాంగ్రెస్ నాయకులు పాల్గొన్నారు.