బీఆర్ఎస్ నుండి కాంగ్రెస్ పార్టీలోకి చేరికలు

నవతెలంగాణ- కమ్మర్ పల్లి: వేల్పూర్ మండలం మోతే  గ్రామానికి చెందిన బీఆర్ఎస్ నాయకులు కార్యకర్తలు  కాంగ్రెస్ పార్టీలో చేరారు. రాజేందర్ మహేష్ ఆధ్వర్యంలో కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే అభ్యర్థి ముత్యాల సునీల్ కుమార్ సమక్షంలో కాంగ్రెస్ పార్టీలో చేరారు. సోమవారం  మోర్తాడ్ లోని ప్రజా నిలయంలో పార్టీలో  చేరిన వారికి సునీల్ కుమార్ కండువా కప్పి ఆహ్వానించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కాంగ్రెస్ పార్టీ ప్రకటించిన ఆరు గ్యారెంటీ లతోపాటు, అభయ హస్తం మేనిఫెస్టోను ప్రజల్లోకి విస్తృతంగా తీసుకుపోవాలన్నారు. కాంగ్రెస్ పార్టీ గ్యారెంటీలు, మేనిఫెస్టోతో సబండ వర్గాలకు న్యాయం జరుగుతుందని తెలిపారు.ఈ కార్యక్రమంలో మండల కాంగ్రెస్ పార్టీ నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు.