బీఆర్ఎస్ పార్టీలో చేరికలు

నవతెలంగాణ -వలిగొండ రూరల్: మండల పరిధిలోని వర్కట్ పల్లి గ్రామ కాంగ్రెస్ పార్టీ నుండి ప్రధాన కార్యదర్శి బంగారి మహేష్ కుమార్, గుండు శీను, మీసాల సైదులు, మీసాల గణేష్, బంగారి వెంకటేష్, బంగారి ప్రవీణ్ కుమార్  ఎమ్మెల్యే  శేఖర్ రెడ్డి  సమక్షంలో మంగళవారం బీఆర్ఎస్ పార్టీలో చేరారు. చేరిన వారికి  కండువాలు కప్పి పార్టీలొకి ఆహ్వానించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ బీఆర్ఎస్ సంక్షేమ పథకాలు నచ్చి పార్టీలో చేరుతున్నట్లు చెప్పారు. ఈ కార్యక్రమంలో బిఆర్ఎస్ గ్రామ శాఖ అధ్యక్షులు గుండు స్వామి, యూత్ అధ్యక్షులు మీసాల స్వామి, గ్రామ సర్పంచ్ మీసాల శేఖర్ తదితరులు పాల్గొన్నారు.