అభివృద్ధి కార్యక్రమాలను చూసి బీఆర్ఎస్ పార్టీలోకి చేరికలు

– రాష్ట్ర పంచాయతీరాజ్ శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు
నవతెలంగాణ- పెద్దవంగర:
కేసీఆర్ ప్రభుత్వం అమలు చేస్తున్న పలు అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలను చూసి బీఆర్ఎస్ పార్టీలోకి చేరుతున్నారని రాష్ట్ర పంచాయతీరాజ్ శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు అన్నారు. శుక్రవారం పోచంపల్లి గ్రామానికి చెందిన కాంగ్రెస్ వార్డు సభ్యులు కనుకుంట్ల నరేష్, యూత్ నాయకులు మంత్రి ఎర్రబెల్లి సమక్షంలో బీఆర్ఎస్ పార్టీలో చేరారు. వీరికి మంత్రి పార్టీ కండువా కప్పి సాదరంగా పార్టీలోకి ఆహ్వానించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. తెలంగాణ ప్రభుత్వం అన్ని వర్గాల ప్రజలకు సంక్షేమ పథకాలను అమలు చేస్తుందని తెలిపారు. పార్టీకి కార్యకర్తలే పట్టుకొమ్మలని, వారిని కంటికి రెప్పలా కాపాడుకుంటానని చెప్పారు. బీఆర్ఎస్ లో చేరిన నాయకులకు సముచిత స్థానం కల్పిస్తామని హామీ ఇచ్చారు. రాబోయే ఎన్నికల్లో భారీ మెజార్టీతో గెలిపించాలని కార్యకర్తలకు పిలుపునిచ్చారు. పార్టీ గెలుపు కోసం కార్యకర్తలు సమన్వయంతో పని చేయాలని సూచించారు. కార్యక్రమంలో బీఆర్ఎస్ సీనియర్ నాయకులు శ్రీరామ్ సుధీర్, సోమేశ్వర్ రావు, సుధగాని మనోహర్, సమ్మయ్య, యూత్ నాయకులు రాంపెల్లి హరీష్, సుధగాని అశోక్, సుధగాని శ్రీకాంత్ తదితరులు పాల్గొన్నారు.