కసిరెడ్డి సమక్షంలో కాంగ్రెస్ లో చేరికలు 

నవతెలంగాణ-ఆమనగల్: కల్వకుర్తి అసెంబ్లీ కాంగ్రెస్ అభ్యర్థి కసిరెడ్డి నారాయణరెడ్డి సమక్షంలో కాంగ్రెస్ లో చేరికలు వెల్లువలా కొనసాగుతున్నాయి. ఆమనగల్ బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షులు యాట నర్సింహ ముదిరాజ్ ఆధ్వర్యంలో గురువారం కడ్తాల్ మండలంలోని మక్తమాధారం గ్రామానికి చెందిన వివిధ పార్టీల నాయకులు పి.శివ, సి.యాదగిరి, ఏ.నరేందర్, ఏ.అరుణ్ తదితరులు కాంగ్రెస్ లో చేరారు. ఈసందర్భంగా వారిని ఎమ్మెల్సీ కసిరెడ్డి నారాయణరెడ్డి కాంగ్రెస్ కండువాలతో పార్టీలోకి ఆహ్వానించారు. నియోజకవర్గంలో కాంగ్రెస్ జెండా ఎగురడమే లక్ష్యంగా ప్రతి ఒక్కరు కృషి చేయాలని సూచించారు. ఈకార్యక్రమంలో కిసాన్ సెల్ అధ్యక్షులు బాలరాజు, సీనియర్ నాయకులు హన్మా నాయక్, యాదగిరి రెడ్డి, చెన్నయ్య, నారాయణ, శ్రీకాంత్ రెడ్డి, ఎన్ఎస్ యూఐ మండల అధ్యక్షులు ఎం.డీ.షాబుద్దీన్, కృష్ణ నాయక్, శివ తదితరులు పాల్గొన్నారు.