నవతెలంగాణ – జుక్కల్
జహీరాబాద్ పార్లమెంట్ కాంగ్రెస్ అభ్యర్థి సురేష్ షెట్కార్ గారి గెలుపే లక్ష్యంగా పనిచేస్తూ ఎన్నికల ప్రచారంలో భాగంగా నిన్న శనివారం రాత్రి జుక్కల్ మండలంలోని గుల్ల,గుల్ల తాండ, చిన్న గుల్ల గ్రామాలలో ప్రచార కార్యక్రమాల్లో పాల్గొన్న జుక్కల్ ఎమ్మెల్యే తోట లక్ష్మీ కాంతారావు గారు మరియు తెలంగాణ ఆగ్రో ఇండస్ట్రీస్ చైర్మన్ కాసుల బాలరాజ్ గారు..బీఆర్ఎస్ మాజీ సర్పంచ్,ఉప సర్పంచ్,నాయకులు,కార్యకర్తలు,మహిళలు ఎమ్మెల్యే తోట లక్ష్మీ కాంతారావు గారి సమక్షంలో కాంగ్రెస్ పార్టీలో చేరారు. అంతకుముందు ఎమ్మెలేను గుర్రంపైన ఉరేగింపుగా తీసుకెళ్లి ఘణంగా సత్కరించారు. ఈ సంధర్భంగా ఎర్పాటు చేసిన కార్యక్రమంలో ఎమ్మెలే తోట లక్ష్మీకాంతారావ్ మాట్లాడుతు ప్రతి ఒక్కొక్క కార్యకర్తలు వందల మందితో మానంగా కార్యకర్త సైనికుడిలా పని చేసి జహిరాబాద్ ఎంపి గా సురేష్ షెట్కార్ ను భారీ మేజార్టీతో గెలిపించాలని పేర్కోన్నారు. ఈ కార్యక్రమంలో మండల కాంగ్రేస్ వర్కింగ్ ప్రసిడెంట్ అస్పత్ వార్ వినోద్, సీనీయర్ నాయకుడు కేమ్రాజ్ కల్లాలీ మాజీ సర్పంచ్ కలకర్ణి రమేష్ దేశాయి, మాజీ ఎంపిపి లక్ష్మన్ పటేల్. తదితరులు పాల్గోన్నారు.