ఎమ్మెల్యే సమక్షంలో కాంగ్రెస్ లో చేరికలు

నవతెలంగాణ – జుక్కల్
మండలం లోని బస్వాపూర్ గ్రామానికి చెందిన కాంగ్రెస్ పార్టీ నాయకులు రమేష్ దేశాయ్ ఆధ్వర్యంలో గ్రామ బీఆర్ఎస్ అధ్యక్షులు బస్వరాజ్ పాటిల్, మాజీ సర్పంచ్ బస్వంత్, నాయకులు జుక్కల్ ఎమ్మెల్యే తోట లక్ష్మీ కాంతారావు సమక్షంలో కాంగ్రెస్ పార్టీలో గురువారం చేరారు. ఈ సంధర్భంగా ఎమ్నెల్యే తోట లక్ష్మీకాంతారావ్ మాట్లాడుతూ.. పార్టీలో చేరిన వారికి తగిన ప్రాధాన్యత ఇవ్వడం జరుగుతుందని తెలిపారు. జహిరాబాద్ ఎంపీ సురేష్ షెట్కార్ గెలుపుకు అందరూ కలిసి కట్టుగా పని చేసి భారీ మెజార్టీతో గెలిపించాలని పార్టీ శ్రేణులను కోరారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ గ్రామ స్థాయి నాయకులు తదితరులు పాల్గోన్నారు.