మండలంలోని కుప్కల్ గ్రామానికి చెందిన మాజీ భీంగల్ మండల బీఆర్ఎస్ పార్టీ అధ్యక్షుడు, మాజీ మార్కెట్ కమిటీ అధ్యక్షుడు, బీఆర్ఎస్ బాల్కొండ నియోజకవర్గ సమన్వయ కమిటీ అధ్యక్షుడు,మాజీ సర్పంచ్ గుణ్ వీర్ రెడ్డి ఆదివారం బాల్కొండ నియోజకవర్గ కాంగ్రెస్ పార్టి ఇంచార్జ్ ముత్యాల సునీల్ కుమార్ సమక్షంలో కాంగ్రెస్ పార్టిలో చేరారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రజాపాలనకు ఆకర్షితులై, నియోజకవర్గంలో ముత్యాల సునీల్ కుమార్ నాయకత్వంలో ప్రజాసేవ చేయడానికి కాంగ్రెస్ పార్టిలొ చేరుతున్నట్టు గున్వీరెడ్డి తెలిపారు. ఈ కార్యక్రమంలో మండల కాంగ్రెస్ పార్టీ నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు.