వివిధ పార్టీల నుండి కాంగ్రెస్ పార్టీలో చేరికలు

నవతెలంగాణ-భిక్కనూర్
మండలంలోని సిద్ధి రామేశ్వర నగర్ గ్రామానికి చెందిన వివిధ పార్టీలకు చెందిన కార్యకర్తలకు మాజీ మంత్రి షబ్బీర్ అలీ పార్టీ కండువాలు కప్పి కాంగ్రెస్ పార్టీలోకి ఆహ్వానించారు. ఈ సందర్భంగా షబ్బీర్ అలీ మాట్లాడుతూ.. కాంగ్రెస్ పార్టీలో పనిచేసే కార్యకర్తలకు తగిన గుర్తింపు ఉంటుందని, రాష్ట్రంలో కొనసాగుతున్న అవినీతి పాలనపై ప్రజలు, కార్యకర్తలు తిరుగుబాటు చేయవలసిన అవసరం ఎంతైనా ఉందన్నారు. రానున్న ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తుందని, కార్యకర్తలు కష్టపడి పని చేయాలని సూచించారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర కాంగ్రెస్ కార్యదర్శి ఇంద్రకరణ్ రెడ్డి, జిల్లా ఉపాధ్యక్షులు చంద్రకాంత్ రెడ్డి, మండల పార్టీ అధ్యక్షులు భీమ్ రెడ్డి, బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షులు సుదర్శన్, ఎంపిటిసి సభ్యులు మోహన్ రెడ్డి, నాయకులు భరత్, తిరుపతి, సంతోష్, తదితరులు పాల్గొన్నారు.