నవతెలంగాణ – వేములవాడ రూరల్
వేములవాడ రూరల్ మండలం నూకలమర్రి, హన్మజిపేట గ్రామాలకు చెందిన మాజీ సర్పంచ్ లు,మాజీ వైస్ ఎంపీపీ, మాజీ ఎంపీటీసీలు, మాజీ వార్డు సభ్యులు, సింగిల్ విండో డైరెక్టర్లు సుమారు 200 మంది బిజెపి, బిఆర్ఎస్ నాయకులు రూరల్ మండల కాంగ్రెస్ పార్టీ వాకులాభరణం శ్రీనివాస్ ఆధ్వర్యంలో ఆయా గ్రామ శాఖల సమన్వయంతో శుక్రవారం కాంగ్రెస్ పార్టీలో చేరారు. వారికి ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్ కండువా కప్పి కాంగ్రెస్ పార్టీలోకి ఆహ్వానించారు. వారు మాట్లాడుతూ కాంగ్రెస్ పార్టీ అమలు చేస్తున్న ప్రజా సంక్షేమ పథకాలు నచ్చి కాంగ్రెస్ పార్టీలో చేరడం జరిగిందని తెలిపారు. పేద ప్రజలకు సంక్షేమ పథకాలు అందాలన్నా రాష్ట్రంలోని ప్రజలకు న్యాయం జరగాలన్న కేవలం కాంగ్రెస్ పార్టీ ద్వారానే సాధ్యమైతుందని అన్నారు. గత కొన్ని సంవత్సరాలుగా బిజెపి, బిఆర్ఎస్ పార్టీలలో సుదీర్ఘ కాలం పనిచేస్తున్న సరైన గుర్తింపు దక్కలేదని తెలిపారు. రానున్న ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ గెలుపే లక్ష్యంగా కలిసికట్టుగా పనిచేస్తామని చెప్పారు. ప్రభుత్వ విప్ మాట్లాడుతూ.. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నేతృత్వంలో దావోస్ పర్యటన విజయవంతంగా ముగించుకొని నేడు రాష్ట్రానికి తిరిగి వచ్చారని వారు లక్ష డెబ్బై తొమ్మిది వేల కోట్ల పెట్టుబడులతో సుమారు 49 వేలపై చిలుకు ఉద్యోగాలు లభిస్తాయని తెలిపారు. ప్రజలు, ప్రజా ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాలు మార్చి వారు సుదీర్ఘకాలం పనిచేసిన పార్టీలను వదిలి కాంగ్రెస్ పార్టీలో చేరడం జరుగుతుందన్నారు. కొత్త పాత అనే తేడా లేకుండా కలిసికట్టుగా రానున్న ఎన్నికల్లో విజయం లక్ష్యంగా పనిచేయాలని సూచించారు. ఈ కార్యక్రమంలో రూరల్ కాంగ్రెస్ అధ్యక్షులు వకుళాభరణం శ్రీనివాస్, రోమాల ప్రవీణ్, మాజీ ఎంపీపీ రంగు వెంకటేష్ గౌడ్, మాజీ సర్పంచులు, జడ్పిటిసిలు, ఎంపిటిసిలు తో పాటు స్థానిక నాయకులు పాల్గొన్నారు.