అభివృద్ధి చూసి పార్టీలో చేరిక..

– డిసిసిబి చైర్మన్ గొంగడి మహేందర్ రెడ్డి 

నవతెలంగాణ- బొమ్మలరామారం 
సీఎం కేసీఆర్ రాష్ట్రంలో చేపడుతున్న అభివృద్ధి సంక్షేమ పథకాలకు ముందుగానే వివిధ పార్టీల చెందిన నాయకులు కార్యకర్తలు బీఆర్ఎస్ లో చేరుతున్నారని డిసిసిబి చైర్మన్ గొంగడి మహేందర్ రెడ్డి అన్నారు. మండలంలోని మునీరాబాద్ గ్రామపంచాయతీ పరిధిలోని సోమాజిపల్లి తండా నుండి కాంగ్రెస్ పార్టీ నుంచి 24 మంది యువకులు ఎంపీపీ చిమ్ముల సుధీర్ రెడ్డి ఆధ్వర్యంలో  బీఆర్ఎస్ పార్టీలో చేరడం జరిగింది. ఈ కార్యక్రమంలో మునిరాబాద్ ఉప సర్పంచ్ చందర్ నాయక్,గ్రామ శాఖ అధ్యక్షులు అశోక్, మాజీ వార్డు సభ్యులు రాజు నాయక్, ఉప్పల కృష్ణ, తొంట సత్యనారాయణ, అరి గే మహేష్, కేతావత్ రమేష్, ధీరావత్ సీతారాం తదితరులు నాయకులు పాల్గొన్నారు.