అభివృద్ధిని చూసి పార్టీలో చేరికలు

– మరోసారి ఆశీర్వదిస్తే, నియోజక వర్గం మరింత అభివృద్ధి
– ఎమ్మెల్యే మంచిరెడ్డి కిషన్‌రెడ్డి
– అంబోతతండాలో కాంగ్రెస్‌ నాయకులు బీఆర్‌ఎస్‌లో చేరికలు
నవతెలంగాణ-మంచాల
15 ఏండ్లుగా ఇబ్రహీంపట్నం నియోజకవర్గాన్ని అనేక రకాలుగా అభివృద్ధి చేశారనీ, ప్రజలు మరోసారి మరింత అభివృద్ధి చేస్తామని ఎమ్మెల్యే మంచిరెడ్డి కిషన్‌రెడ్డి అన్నారు. మంగళవారం మండల పరిధిలోని అంబొత్‌ తండా గ్రామానికి చెందిన కాంగ్రెస్‌ నాయకులు ఎమ్మెల్యే మంచిరెడ్డి కిషన్‌రెడ్డి సమక్షంలో బీఆర్‌ఎస్‌లో చేరారు. ఈ సందర్భంగా మంచిరెడ్డి కిషన్‌రెడ్డి మాట్లాడుతూ ఇబ్రహీంపట్నం నియోజకవర్గంలో జరిగిన అభివృద్ధి పనులు, ప్రభుత్వం ప్రవేశపెట్టిన సంక్షేమ పథకాలను చూసే, పలువురు బీఆర్‌ఎస్‌లో చేరుతున్నారని చెప్పారు. రానున్న ఎన్నికలలో కారు గుర్తుకు ఓటు వేసి అత్యధిక మెజార్టీతో గెలిస్తే నియోజకవర్గాన్ని మరింత అభివృద్ధి చేస్తానమన్నారు. ఈ కార్యక్రమంలో బీఆర్‌ఎస్‌ మండలాధ్యక్షులు చీరాల రమేష్‌, ఎంపీపీ జటోత నర్మదలచ్చిరాం, ఉపసర్పంచ్‌ రాజు, బీఆర్‌ఎస్‌ యువజన విభాగం మండల అధ్యక్షులు వనపర్తి బద్రీనాథ్‌ గుప్త, పీఏసీఎస్‌ డైరెక్టర్‌ నారి యాదయ్య, లోయ పల్లి గ్రామ శాఖ అధ్యక్షులు జానయ్య, తదితరులున్నారు.