సంక్షేమ పథకాలకు ఆకర్షితులై పార్టీలో చేరికలు

– ఘనంగా బతుకమ్మ వేడుకలు
– తాండూరు గడ్డపై గులాబీ జెండా ఎగరడం ఖాయం
– ఎమ్మెల్యే పైలెట్‌ రోహిత్‌ రెడ్డి
నవతెలంగాణ-యాలాల
బీఆర్‌ఎస్‌ చేసిన సంక్షేమ పథకాలకు ఆకర్షితులై భారీ గా పార్టీలోకి చేరికలు జరుగుతున్నాయని ఇది బీఆర్‌ఎస్‌ గెలుపునకు నిదర్శనమని ఎమ్మెల్యే పైలెట్‌ రోహిత్‌ రెడ్డి అన్నారు. ఆదివారం మండల పరిధిలోని కమాల్పూర్‌, ముద్దాయి పేట్‌ గ్రామాలలో బతుకమ్మ వేడుకల్లో ఎమ్మెల్యే ముఖ్యఅతిథిగా పాల్గొన్నారు. గ్రామల యువత, మహిళలు ఎమ్మెల్యే పైలెట్‌ రోహిత్‌ రెడ్డి సమక్షంలో పార్టీ కండువా కప్పుకున్నారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ…. బీఆర్‌ఎస్‌ ప్రభుత్వం చేస్తున్న సంక్షేమ పథకాల అమలుకు ఆకర్షితులై తిరిగి బీఆర్‌ఎస్‌ పార్టీకి పట్టం కట్టాలనే సదుద్దే శంతో ప్రతి గ్రామంలో భారీగా చేరికలు జరుగుతున్నా యని ఇది బీఆర్‌ఎస్‌ పార్టీ గెలుపునకు నిదర్శనమని అన్నా రు. తెలంగాణ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత బతుకమ్మ పండుగను రాష్ట్ర పండుగగా గుర్తించి, పండుగకు ఒక ప్రత్యేక స్థానాన్ని కల్పించడం జరిగిందన్నారు. తెలంగాణ ఆడబిడ్డలు సంతోషాల నడుమ పండుగను జరుపుకో వాలనే ఉద్దేశంతో బతుకమ్మ చీరలను ప్రభుత్వం అందిస్తుం దన్నారు. ఎన్నికల మేనిఫెస్టో తెలంగాణ ప్రజల ఆకాంక్షల ను పెంచే విధంగా ఉండడం ఎంతో సంతోషంగా ఉంద న్నారు. తాండూరు గడ్డపై మరోసారి గులాబీ జెండా ఎగరడం ఖాయమన్నారు. ఈ కార్యక్రమంలో మండల పార్టీ అధ్యక్షులు రవీందర్‌ రెడ్డి, బీఆర్‌ఎస్‌ రాష్ట్ర నాయకులు కరణం పురుషోత్తమరావు, మాజీ జెడ్పిటిసి సభ్యులు సిద్రాల శ్రీనివాస్‌, మాజీ సర్పంచులు వెంకటరెడ్డి, వెంకట య్య, నాయకులు శ్రీనివాస్‌ గౌడ్‌, అమర్నాథ్‌ రెడ్డి, సింగర్‌ నాయకులు, కార్యకర్తలు,తదితరులు పాల్గొన్నారు.