కాంగ్రెస్ లో గ్రామ సర్పంచ్ తోపాటు మరికొందరు చేరిక 

– కాంగ్రెస్ హయాంలోనే తండాలు అభివృద్ధి చెందాయి : రూరల్ ఎమ్మెల్యే భూపతిరెడ్డి 
నవతెలంగాణ-  ధర్పల్లి
మండలంలోని గుడి తండా గ్రామా సర్పంచ్ లింబియా నాయక్ తోపాటు తండాకు చెందిన పలువురు నాయకులు బుధవారం రూరల్ ఎమ్మెల్యే డా. భూపతిరెడ్డి ఆధ్వర్యంలో  బీఆర్ఎస్ పార్టీ వీడి, కాంగ్రెస్ పార్టీ తీర్తం పుచ్చుకున్నారు. ఈసందర్బంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ దేశంలోనే పేద ప్రజలను ఆదుకున్న ప్రభుత్వం ఏదైనా ఉన్నదంటే అది కాంగ్రెస్ ప్రభుత్వమే నని ఆయన అన్నారు. రాష్ట్రంలోని గిరిపుత్రులు నివసించే ప్రతి తండాను అభివృద్ధి చేసి వారు ఎదిగేందుకు ఎన్నో పథకాలను ప్రవేశ పెట్టి వారిని అందించిన ఘనత కాంగ్రెసుదే నని అన్నారు. ఇందిరమ్మ హయాంలో గిరిజనులకు బతుకు దెరువు కొరకు భూములు ఇచ్చి, వాటికీ సాగుకు కావలసిన ఆర్థిక సహాయంతోపాటు , నీటి సౌకర్యం కొరకు బోరు వాగులను ,పంపు సెట్లను అందించి వారిని ఆదుకున్నారని అన్నారు. వారి పిల్లలకు విద్యలో రిజర్వేషన్ అందించి, సమాజంలో తలెత్తుకొని బతికేలా చేసిన ఘనత కాంగ్రెస్ దే అనిఅన్నారు. అందుకే ఈరోజు రాష్ట్ర  ప్రజలు దొరల రాజ్యాన్ని కాదని , ఇందిరమ్మ రాజ్యాన్ని కోరుకున్నారని అన్నారు. ఇందిరమ్మ రాజ్యమంటే పేదల రాజ్యం. బడుగు బలహీనవర్గాల రాజ్యం,అన్ని వర్గాల ప్రజలకు అన్నివిధాలా ఆదుకునే కాంగ్రెస్ పార్టీకి కోరుకోవడం జరిగిందని అన్నారు. రానున్న పార్లమెంట్ స్థానాన్ని మనమందరం కలిసి కట్టుగా పని చేసి మన పార్లమెంట్ స్థానాన్ని సోనియామ్మకు బహుమతిగా అందించేందుకు ప్రణాళికతో ముందుకు వెళ్ళవలసిన అవసరము ఎంతైనా ఉందని అన్నారు. కాంగ్రెస్ కార్యకర్తలకు ఎలాంటి ఇబ్బందుకు రాకుండా పార్టీ కడుపులో పెట్టుకొని చూసుకుంటుందని అన్నారు. పార్టీలో కష్టపడ్డ వారికి తప్పకుండ పదవులు వస్తాయని అన్నారు. కార్యక్రమములో సర్పంచ్ తోపాటు పార్టీలో చేరినవారు,బిఆర్ఎస్ గ్రామా శాఖా అధ్యక్షుడు రమేష్,నాయకులూ మోతిరాం,మాగిత్యా,లక్ష్మణ్,రాజు,బలరాం,సంతోష్ లు పార్టీలో చేరగా వారిని ఎమ్మెల్యే పార్టీ ఖండువా కప్పి పార్టీలోకి సాదరంగా అహురణించారు. కార్యక్రమములో మండల అధ్యక్షుడు ఆర్మూర్ చిన్న బాలరాజ్,పార్టీ సీనియర్ నాయకుడు జెసిబి శ్రీనివాస్,తదితరులు పాల్గొన్నారు.