
హుజురాబాద్ కాంగ్రెస్ పార్టీ ఇంఛార్జి వొడితల ప్రణవ్ సమక్షంలో బి.ఆర్.ఎస్.పార్టీ నుండి కాంగ్రెస్ పార్టీ లో చేరినారు. జమ్మికుంట మున్సిపాలిటీ పరిధిలోని 22 వ వార్డు అంబేద్కర్ కాలనీ నుండి బిఆర్ ఎస్ పార్టీ నుండి వార్డు కౌన్సిలర్ పొంగంటి మల్లయ్య,సుంకరి రమేష్ , ఆధ్వర్యంలో సుమారు 100 మంది కాంగ్రెస్ పార్టీలో చేరారు. వారందరికీ హుజురాబాద్ నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఇన్చార్జ్ ఒడి తల ప్రణవ్ బాబు కాంగ్రెస్ పార్టీ కండువా కప్పి, పార్టీలోకి ఆహ్వానించారు. కాంగ్రెస్ పార్టీలో చేరిన వారిలో గుల్లి ప్రతాప్, కనకం తిరుపతి, వడ్డూరి శ్రీనివాస్, ఇల్లందుల శ్రీనివాస్, ఇల్లందుల భద్రయ్య, వడ్లూరు సంపత్, దేవేందర్, ఇల్లందుల కిషోర్, ఉదయ్, మహేష్, రాజు, జగన్, సతీష్, వెంకటేష్ ,వడ్లూర్ కిషోర్ తదితరులు ఉన్నారు.