బెల్ట్ దుకాణంపై సంయుక్త దాడులు

నవతెలంగాణ – అశ్వారావుపేట
ఎన్నికల నేపద్యంలో అక్రమ రవాణ,విక్రయాలపై అప్రమతమైన అధికారులు బెల్టు దుకాణాలపై దాడులు నిర్వహించారు. మండలంలోని కొత్త మామిళ్ళవారిగూడెం, నారాయణపురం సూర్యం శుక్రవారం ఎన్నికల విభాగం ప్లైయింగ్ స్క్వాడ్ ఆఫీసర్ ఎల్. కృష్ణ నేతృత్వంలో ఎక్సైజ్ అధికారులు దాడుల నిర్వహించారు. దాడుల్లో రూ.30 వేల విలువ గల 80 లీటర్ల మద్యం స్వాధీనం చేసుకున్నా వ్యక్తులపై కేసులు నమోదు చేసి దర్యాప్తు నిర్వహిస్తున్నట్లు ఎక్సైజ్ ఎస్సై రాజేశ్వరరావు తెలిపారు. దాడుల్లో సిబ్బంది పాల్గొన్నారు.
సరిహద్దులో  దాడులు
రాష్ట్ర సరిహద్దు గ్రామాల్లో ఆంధ్రప్రదేశ్ ఎక్సైజ్ అధికారులతో కలిసి అశ్వారావుపేట ఎక్సైజ్ అధికారులు శుక్రవారం దాడులు నిర్వహించారు. ఏలూరు జిల్లా చింతలపూడి మండలం లో నాటు సారా తయారీకి వినియోగించే 20 వేల విలువ గల 250 లీటర్ల బెల్లం పానకాన్ని ద్వంసం చేశారు. దాడుల్లో అశ్వారావుపేట ఎక్సైజ్ అధికారి రాజేశ్వరరావు, చింతలపూడి స్పెషల్ ఎన్ఫోర్స్మెంట్ బ్యూరో డిపార్ట్మెంట్ ఎస్సై లక్ష్మణరావు, సిబ్బంది పాల్గొన్నారు.