
నవతెలంగాణ-పెన్ పహాడ్:
ఎన్నికలు సమీపిస్తున్న తరుణంలో అన్ని పార్టీలు ప్రచారంలో ముందంజలో ఉండేందుకు ప్రయత్నాలు చేస్తున్న నేపథ్యంలో బిఎస్పి పార్టీలో సూర్యాపేట నియోజక వర్గ అభ్యర్ధి వట్టే జానయ్య యాదవ్ జోష్ నింపుతున్నారు. చిన్న నుండి పైస్థాయి నాయకుల వరకు నిత్యం అందుబాటులో ఉండడమే కాక మండలంలో పగలు, రాత్రి తేడాలు లేకుండా పర్యటనలు చేస్తున్నాడు. అంతే కాక వివిధ పార్టీలలో అసంతృప్తులను పార్టీలో చేర్చుకున్నారు. మండల పరిధిలోని చెట్ల ముకుందాపురం గ్రామ యువకులు వివిధ పార్టీలకు రాజీనామా చేసి బీఎస్పీలో ఎల్లావుల కోటేష్ అధ్యక్షతన బుధవారం జానయ్య యాదవ్ ఆధ్వర్యంలో పార్టీలో చేరారు. ఈ సందర్భంగా జానయ్య వారికి పార్టీ కండువాలు కప్పి ఆహ్వానించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ స్థానికుడిగా, బహుజన బిడ్డగా తమ ముందుకు వస్తున్నానని, ఏనుగు గుర్తుకు ఓటేసి ఆశీర్వదించాలని ఆయన కోరారు. పార్టీలో చేరిన వారిలో వీరబాబు, లింగయ్య, నరేష్, కృష్ణవేణి, హరీష్, శంకర్, వినోదు, శ్రీకాంత్, మణిదీప్, ఉపేందర్, సింహాద్రి, మహేష్, సతీష్, ధనలక్ష్మి, పాపమ్మ, వెంకటమ్మ, ఉండగా కార్యక్రమంలో పార్టీ నాయకులు ఆవుల అంజయ్య, నాగరాజు, కిరణ్, హరీష్, నగేష్, వెంకటేష్, రమేష్ తదితరులు పాల్గొన్నారు.