జర్నలిస్ట్ నవీన్ సేవలు ఎనలేనివి..

– కాంగ్రెస్ సీనియర్ నాయకురాలు శైల రావు 

నవతెలంగాణ – పెద్దవంగర
పత్రికా రంగంలో తాళ్లపల్లి నవీన్ అందించిన సేవలు ఎనలేనివని కాంగ్రెస్ సీనియర్ నాయకురాలు నెమరుగొమ్ముల శైల రావు అన్నారు. కొరిపల్లి గ్రామానికి చెందిన జర్నలిస్ట్ నవీన్ ఇటీవల విద్యుదాఘాతంతో మృతి చెందిన విషయం తెలిసిందే. శనివారం బాధిత కుటుంబ సభ్యులను ఆమె పరామర్శించి, ఆర్థిక సహాయం అందించారు. నవీన్ అకాల మరణం బాధాకరం అన్నారు. జర్నలిస్ట్ గా ఆయన అందించిన సేవలను కొనియాడారు. ప్రమాదవశాత్తు మృతి చెందిన జర్నలిస్టుల కుటుంబాలను ప్రభుత్వం ఆదుకోవాలన్నారు. ఆమె వెంట కాంగ్రెస్ నాయకులు ఉట్ల వీరా రెడ్డి, చట్ల యాకన్న తదితరులు ఉన్నారు.