పాత్రికేయులు సమాజానికి కీలకం

– విలువలతో కూడిన జర్నలిజాన్ని సమాజానికి అందించాలి
నవతెలంగాణ-కోహెడ
సమాజంలో జరుగుతున్న నిజాన్ని నిర్భయంగా రాసే పాత్రికేయ వృత్తి కీలకమైనదని టీయూడబ్యూజె రాష్ట్ర నాయకులు డాక్టర్‌ కోహెడ ప్రసాదరావుశర్మ అన్నారు. బుధవారం మండలంలోని తంగళ్ళపల్లి వేణుగోపాలస్వామి దేవాలయ ఆవరణలో కోహెడ ప్రెస్‌ క్లబ్‌ రిజిస్ట్రేషన్‌ నెంబర్‌ 1051/2017 నూతన కార్యవర్గ ఎన్నికలను ఏకగ్రీవంగా నిర్వహించారు. ఎన్నికల పరిశీలకులుగా ఆయనతో పాటు టీయూడబ్యూజే జిల్లా ఉపాధ్యాక్షుడు పున్నం రాజు, సీనియర్‌ జర్నలిస్ట్‌ శ్రీనివాస్‌రెడ్డిలు వ్యవహారించారు. నూతన కార్యవర్గం గౌరవ అధ్యక్షులుగా గొరీట్యాల లక్ష్మణ్‌, అధ్యక్షులుగా అర్శనపల్లి ముని, ప్రధాన కార్యదర్శిగా ముల్కల హరీష్‌, ఉపాధ్యక్షులుగా రాగుల సతీష్‌, ఎండి సర్వర్‌, ర్యాకం శ్రీనివాస్‌, బి. శ్రీనివాస్‌, సంయుక్త కార్యదర్శులుగా నరేష్‌, వట్టిపల్లి శ్రీనివాస్‌ రెడ్డి, వడ్డేపల్లి ప్రశాంత్‌, కోశాధికారిగా కొంకటి జితేందర్‌, కార్యవర్గ సభ్యులుగా కత్తి సతీష్‌, బండి డాబులు, మీర్జాపురం సంపత్‌ చారి, హేమాంబరచారి, నంగునూరి కిరణ్‌, సత్యనారాయణ, ఖమ్మం రాకేష్‌లు ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. అనంతరం వారు మాట్లాడుతూ, విలువలతో కూడిన జర్నలిజం నేటి రోజుల్లో అవసరమని స్పష్టం చేశారు. జర్నలిస్టులు ఐకమత్యంతో సంఘంగా ఏర్పడి నప్పుడే సమస్యల పరిష్కారం సులువవుతోందన్నారు. ఐజేయుకు అనుబంధంగా టీయుడబ్ల్యూజె రాష్ట్ర కార్యవర్గం జర్నలిస్ట్‌లు సమస్యల పరిష్కారానికి కషి చేస్తున్నట్లు ఆయన వివరించారు. ఈ సందర్భంగా అధ్యక్షుడు మాట్లాడుతూ రానున్న రోజులలో మండల కేంద్రంలో కోహెడ ప్రెస్‌ క్లబ్‌ కార్యాలయాన్ని ఏర్పాటు చేయనున్నట్లు తెలిపారు. అలాగే ప్రభుత్వ సంక్షేమ పథకాలు అందరికీ అందేందుకు సహకరిస్తామన్నారు. కలసికట్టుగా ముందుకు వెళితే ప్రభుత్వ పరంగా వచ్చే సంక్షేమ పథకాలను సాధించుకోవచ్చునని సూచించారు. ఈ సమావేశంలో లింగం, నాగరాజు, శ్రీరంగం నరసింహమూర్తి, గుర్రాల రాజేందర్‌రెడ్డిలతో పాటు మండలంలో పనిచేస్తున్న 26 మంది జర్నలిస్టులు పాల్గోన్నారు.