– సీఎం రేవంత్‌కు ఫెడరేషన్ విజ్ఞప్తి
నవతెలంగాణ-హైదరాబాద్
జర్నలిస్టులకు ఇండ్ల స్థలాలు కేటాయించే ప్రక్రియను ప్రారంభించాలని తెలంగాణ వర్కింగ్ జర్నలిస్ట్స్ ఫెడరేషన్(టీడబ్ల్యూజేఎఫ్) రాష్ట్ర కమిటీ ప్రభుత్వానికి విజ్ఞప్తి చేసింది. ఈ మేరకు ఆ సంఘం రాష్ట్ర అధ్యక్షులు మామిడి సోమయ్య, ప్రధాన కార్యదర్శి బి.బసవపున్నయ్య మంగళవారం ఒక ప్రకటన విడుదల చేశారు. సుప్రీంకోర్డు ఆదేశాలు, కాంగ్రెస్ మ్యానిఫెస్టోలో హామీ ఇచ్చిన ప్రకారం జేఎన్‌జే సొసైటీకి ఇండ్లస్థలాలకు సంబంధిం చిన ఉత్తర్వులు ఇచ్చినందుకు ధన్యవాదాలు తెలియజేశారు. కాగా దాదాపు 40 ఏండ్లుగా జర్నలిస్టులు ఇండ్లస్థలాల కోసం ఎదురుచూస్తున్నారని సీఎం రేవంత్‌రెడ్డికి గుర్తు చేశారు. హైదరాబాద్‌తోపాటు ఆయా జిల్లాలు, మండ లాల్లో ఇంకా వేలాది మంది జర్నలిస్టులకు ఇండ్థస్థలాలు ఇవ్వాల్సిన అవసరం ఉందన్నారు.కొందరికి హౌసింగ్ సొసైటీల్లో సభ్యత్వం ఉందనీ, మరి కొందరికి లేదన్నారు. వీరందరి కోసం ప్రభుత్వం ప్రత్యేక విధానం ద్వారా ఇండ్లస్థలాలు కేటాయించాలని సూచించారు. జర్నలిస్టులు ఇప్పటికే ప్రభుత్వానికి, ప్రజలకు వారధిగా ఉంటూ సామాజిక బాధ్యతలు(సోషల్ రెస్పాన్సిబులి టీ)నిర్వహి స్తున్నారని గుర్తు చేశారు. ప్రజా సమస్యలను ప్రభుత్వం దృష్టికి తీసుకు రావడంలో జర్నలిస్టులు కీలకపాత్ర పోషిస్తున్నారని వివరించారు. ఈ నేపథ్యంలో మ్యానిఫెస్టో ప్రకారం ఇండ్లస్థలాలు ఇవ్వాలని సీఎంకు విజ్ఞప్తి చేశారు. రెండోసారి గెలిచాక ఇస్తామనడం న్యాయం కాదని తెలిపారు. వెంటనే ఫ్యూచర్ సిటీలో స్థలాల గుర్తింపు ప్రక్రియ చేపట్టాలని కోరారు.